Allu Arjun-Trivikram Movie | సినీ పరిశ్రమలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో ఎన్ని సినిమాలు వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకుంటునే ఉంటాయి. అలాంటి వాటిలో అల్లుఅర్జున్-త్రివిక్రమ్ కాంబో ఒకటి. ఇప్పటికే వీళ్లద్దరి కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అలవైకుంఠపురంలో’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు ఒకదానికి మించి మరోకటి ఘన విజయాలు సాధించాయి. ఇక వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కాంబోకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్, బన్నీ కోసం ఓ కథను రెడీ చేశాడట. త్వరలోనే బన్నీని కలిసి స్టోరీ నెరేట్ చేయనున్నట్లు టాక్. బన్నీ కూడా త్రివిక్రమ్‌తో కలిసి మరోసారి సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నాడట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్‌తో ‘SSMB28’ చేస్తున్నాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఇక బన్నీ ‘పుష్ప’ సీక్వెల్‌కు సిద్ధమౌవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే బన్నీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మరి ‘పుష్ప’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడా? సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also:
‘NTR30’ స్టోరీ లైన్ ఇదేనా.. కొరటాల శివ అలాంటి అంశాలను టచ్ చేస్తున్నాడా?
Ori Devuda Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓరి దేవుడా’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Jr. Ntr | రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న ఎన్టీఆర్ సూపర్‌హిట్ మూవీ?
Siva Karthikeyan | శివ కార్తికేయన్ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడీయన్?