Jr. Ntr | రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న ఎన్టీఆర్ సూపర్‌హిట్ మూవీ?
Jr. Ntr Movie Re-Release | ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫిలో అండర్ రేటెడ్ మూవీస్‌లో 'బాద్షా' ఒకటి. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో రిలీజై యావరేజ్‌గా నిలిచింది. రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించలేకపోయింది.
Jr. Ntr Movie Re-Release | ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫిలో అండర్ రేటెడ్ మూవీస్‌లో ‘బాద్షా’ ఒకటి. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో రిలీజై యావరేజ్‌గా నిలిచింది. రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు సాధించలేకపోయింది. శ్రీనువైట్ల అప్పటికే ‘దూకుడు’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక దూకుడు తర్వాత ఈ చిత్రం తెరకెక్కడంతో ప్రేక్షకులలో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తారక్ కూడా ఒక ఇంటర్వూలో రిలీజ్‌కు ముందు బాద్షా చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్టవుతుందని అనుకున్నాని చెప్పాడు. అయితే రిలీజ్ రోజు ఫలితం తేడా రావడంతో నమ్మలేకపోయానని చెప్పాడు.
ఫలితం ఎలా ఈ సినిమాలో కామెడీ సీన్స్‌కు సెపెరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. బ్రహ్మనందం కామెడీని రిపీటేడ్గా చూస్తుంటా. ఇక ఈ చిత్రానికి బ్రహ్మనందంకు బెస్ట్ కామెడీయన్ అవార్డు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మళ్లీ రీ-రిలీజ్ కాబోతుంది. నవంబర్ 19న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. యాక్షన్ కామెడీ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బండ్ల గణేస్ నిర్మించాడు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

