Siva Karthikeyan | శివ కార్తికేయన్ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడీయన్?
Mahaveerudu Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంటున్న నటుడు శివకార్తికేయన్. 'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ.. 'డాక్టర్', 'డాన్' వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు.
Mahaveerudu Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంటున్న నటుడు శివకార్తికేయన్. ‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ.. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘ప్రిన్స్’ రిలీజై యావరేజ్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ ‘మహావీరుడు’ సినిమా చేస్తున్నాడు. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కామెడీయన్ నటిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది.
స్టార్ కామెడీయన్ ఎవరా అనుకంటున్నారా? ఆయన మరెవరో కాదు సునీల్. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడీయన్‌గా పేరు సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి ఫ్లాప్‌లు మూటగట్టుకున్నాడు. మళ్ళీ ఈ మధ్య కమెడీయన్‌గా ఫుల్ బిజీ అయిపోయాడు. కాగా తాజాగా మహావీరుడు చిత్రంలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కి్స్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌కు జోడీగా డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. శాంతీ టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భరత్ శంకర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
We are glad to have @Mee_Sunil onboard! 💐 #Maaveeran@Siva_Kartikeyan @AditiShankarofl @DirectorMysskin @madonneashwin @iamarunviswa @vidhu_ayyanna @bharathsankar12 @philoedit @LokeshJey @DoneChannel1 pic.twitter.com/ey2wfo2fzU
— Shanthi Talkies (@ShanthiTalkies) November 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

