Ori Devuda Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓరి దేవుడా’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Ori Devuda Movie On OTT | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. గతేడాది 'పాగల్' వంటి డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది 'అశోక వనంలో అర్జున కళ్యాణం' వంటి బ్లాక్‌బస్టర్‌తో మంచి శుభారంభం దక్కింది.
Ori Devuda Movie On OTT | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ఈ ఏడాది బాగా కలిసివచ్చింది. గతేడాది ‘పాగల్’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి బ్లాక్‌బస్టర్‌తో మంచి శుభారంభం దక్కింది. అదే జోష్‌తో గతనెల ‘ఓరి దేవుడా’ సినిమాను రిలీజ్ చేశాడు. మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్‌తో ఈ సినిమా మంచి వసూళ్ళను సాధించింది. వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో గతరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే పెళ్ళి తర్వాత కొన్నాళ్ళకే అపార్థాల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఏంటీ? వీళ్ళ సమస్యను దేవుడు ఎలా పరిష్కరించాడు? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్టయిన ఓమై కడువలే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఓరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు.
పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. పూరి జగన్నాధ్ గెస్ట్ రోల్ పోషించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

