NTR30 Movie | నందమూరి అభిమానులే కాదు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ‘NTR30’ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ వస్తున్న వార్తలపై ఇటీవలే చిత్రబృందం ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే మేకర్స్ కొరటాల శివ, సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమఘ్నమైనట్లు ఫోటోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులను మరింత వేగవంతం చేసిందట. ఎట్టి పరిస్థుతుల్లో ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా మెడికల్ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో జరుగనుందట. మన దేశంలో మెడికల్ మాఫీయా ఎలా జరుగుతుంది. ఇల్లీగల్‌గా మెడిసిన్స్‌ను ఎలా తయారు చేస్తున్నారు. అందులో లోసుగులేంటి అనే అంశాలను ఈ చిత్రంలో టచ్ చేయనునట్లు టాక్.ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు టాక్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also:
Arjun Sarja | అర్జున్ సినిమాకు కొత్త హీరో దొరికేశాడా?
Khushi Movie | ‘ఖుషీ’ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Yashodha Movie | ‘యశోద’ సినిమాకు అన్ని కోట్లు ఖర్చయిందా?
Director Shankar | ‘అపరిచితుడు’కి బ్రేక్.. రణవీర్ సింగ్‌తో శంకర్ భారీ బడ్జెట్ మూవీ?