Khushi Movie Non-Theatrical Rights | ఫలితం ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెడుతున్నాడు. ఇటీవలే భారీ అంచనాల నడుమ రిలీజైన ‘లైగర్’ దగ్గర బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. బడ్జెట్లో పావు వంతు కూడా రికవరీ చేయలేకపోయింది. దాంతో విజయ్ కాస్త నిరాశపడ్డాయి. అయితే ఫ్లాప్ వచ్చింది కదా అని అక్కడే ఆగిపోలేదు. అదే అగ్రసీవ్నెస్తో, పాజిటీవ్ యాటిట్యూడ్‌తో తన తదుపరి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘లైగర్’ ఫేయిల్యూర్ తర్వాత విజయ్ క్రేజ్ తగ్గిపోయిందని, మార్కెట్ పడిపోయిందని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఖుషీ నాన్-థియేట్రికల్ హక్కుల రేటు చూస్తే విజయ్ క్రేజ్ ఎలా ఉందో తెలుస్తుంది. ఖుషీ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులకు భారీగా డీల్ కుదిరినట్లు సమాచారం. ఖుషీ మూవీకి డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్లకు కలిపి దాదాపు రూ.90 కోట్ల డీల్ ఫిక్సయిందట. అంతేకాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుందట. వరుసగా మూడు ఫ్లాప్‌లు వచ్చిన ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే రౌడీ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది.
రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మరో 5వారాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. అయితే సమంత ఇటవలే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో ఖుషీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Arjun Sarja | అర్జున్ సినిమాకు కొత్త హీరో దొరికేశాడా?
Director Shankar | ‘అపరిచితుడు’కి బ్రేక్.. రణవీర్ సింగ్‌తో శంకర్ భారీ బడ్జెట్ మూవీ?
Agent Movie | సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న అఖిల్.. ‘ఏజెంట్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే?
Lohithaswa Prasad | ‘అఖండ’ నటుడి తండ్రి, కన్నడ స్టార్ యాక్టర్ మృతి..!