Agent Movie Gets Poned | కెరీర్ బిగెనింగ్ నుండి హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మంచి విజయాన్నిచ్చింది. ప్రస్తుతం అదే జోష్‌తో అఖిల్ ‘ఏజెంట్’ చిత్రాన్ని చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఇటీవలే రిలీజైన టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. కాగా ఈ చిత్రాన్ని మొదట ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా చిత్రాన్ని వాయిదా వేసారు. ఇక ఇటీవలే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
కాగా ఏజెంట్ సినిమా సంక్రాంతికి కూడా రావడం లేదని సమాచారం. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16కు పోస్ట్ పోన్ చేయనున్నట్లు టాక్. అయితే సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉండటంతో ‘ఏజెంట్’ సినిమాకు థియేటర్ల కొరత ఏర్పడిందట. దాంతో ఈ సినిమాను మహా శివరాత్రికి పోస్ట్ పోన్ చేశారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
Director Shankar | ‘అపరిచితుడు’కి బ్రేక్.. రణవీర్ సింగ్‌తో శంకర్ భారీ బడ్జెట్ మూవీ?
Bala Krishna | బాలకృష్ణ ఆ యంగ్ దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
Karthi25 | వినూత్న టైటిల్‌తో కార్తి కొత్త సినిమా..!
Yashoda Movie | అందుకే సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ ‘యశోద’కు డబ్బింగ్ చెప్పా : సమంత