Bala Krishna Next Movie | ‘అఖండ’ తర్వాత బాలకృష్ణ మరింత జోష్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహా రెడ్డి’ సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, అనీల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణ మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాతో విమర్శకులు ప్రశంసలు పొందిన వెంకటేష్ మాహాతో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే వెంకటేష్ మాహా, బాలయ్యకు ఓ కథను నెరేట్ చేశాడట. అయితే బాలయ్య కొన్ని చేంజెస్ చెప్పాడట. ఇక వెంకటేష్ మాహా కొన్ని చేంజెస్ చేసి మరోసారి కథను నెరేట్ చేశాడట. కథ బాగా నచ్చడంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచినట్లు సమాచారం. అన్ని కుదరితో అనీల్ రావిపూడి తర్వాత బాలకృష్ణ వెంకటేష్ మాహాతో సినిమా చేసే చాన్స్ ఉందని టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.