Shankar-Ranveer singh Movie | ఇండియా గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకడు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ప్రస్తుతం ఈయన రామ్‌చరణ్‌తో ‘Rc15’, కమల్ హాసన్‌తో ‘భారతీయుడు-2’ తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఏకకాలంలో జరుపుతున్నాడు. కాగా శంకర్ గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ రీమేక్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా తాజాగా ఈ సినిమా కాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.
అయితే అపరిచితుడు కాకుండా మరో కథను రణ్వీర్తో తెరకెక్కించనున్నాడట. తమిళ ప్రసిద్ధ నవల ‘వేల్పారి’ని ఆధారంగా చేసుకుని శంకర్, రణ్వీర్ సింగ్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఈ ప్రాజెక్ట్ మూడు పార్టులుగా తెరకెక్కనుందని టాక్. శంకర్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శంకర్ ‘RC15’, ‘ఇండియన్-2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక రణ్వీర్ కూడా ‘సర్కస్’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Read Also:
RRR Movie | జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ జైత్ర యాత్ర.. 17రోజుల్లోనే అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Kantara Movie | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్న ‘కాంతార’..!
Yashodha Movie | ‘యశోద’ సినిమాకు అన్ని కోట్లు ఖర్చయిందా?
Love Today Movie | తెలుగులో రిలీజ్ కానున్న.. రీసెంట్ తమిళ్ బ్లాక్‌బస్టర్?