Kantara Movie Record | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘కాంతార’ డామినేషనే కనిపిస్తుంది. సినిమా రిలీజై నెల రోజులు దాటినా ఇంకా కలెక్షన్ల వేట కొనసాగుతూనే ఉంది. కొత్త సినిమాలు ఎన్ని వస్తున్నా.. సినీ ప్రేక్షకులు కాంతార వైపే మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. రిషబ్ శెట్టి నటనకు, దర్శకత్వానికి జైజైలు కొడుతున్నారు. ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డు సాధించింది.
‘కాంతార’ చిత్రం తాజాగా రూ.300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. కన్నడలో రూ.160 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో రూ.60 కోట్లు, తమిళంలో 10 కోట్లు, హిందీలో రూ.62 కోట్లు, మలయాళంలో రూ.15 కోట్లు కలెక్ట్ చేసింది. రోజు రోజుకు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అదరణ పెరుగుతూనే ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా అల్లు అరవింద్‌కు దాదాపు పది రెట్లు లాభాలు తీసుకొచ్చింది. తెలుగులో ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ.25 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం అంటే విశేషం అనే చెప్పాలి.
Read Also:
RRR Movie | జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ జైత్ర యాత్ర.. 17రోజుల్లోనే అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
Rahul Ramakrishna | తండ్రి కాబోతున్న రాహుల్ రామకృష్ణ.. ట్వీట్ వైరల్..!
Vishwak Sen | క్షమించండి సార్.. అర్జున్‌తో వివాదంపై విశ్వక్ సేన్ రియాక్షన్
Maniratnam-Kamal Haasan | 35 ఏళ్ళ తర్వాత మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో సినిమా..!
త్రిపాత్రాభినయంలో కళ్యాణ్‌రామ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘NKR19’ ఫస్ట్‌లుక్ పోస్టర్