Yashodha Movie | ‘యశోద’ సినిమాకు అన్ని కోట్లు ఖర్చయిందా?
Yashodha Movie Budget | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'యశోద' ఒకటి. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
Yashodha Movie Budget | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘యశోద’ ఒకటి. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీను పెంచుతున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు.
ప్రమోషన్లో భాగంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుకున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత శివలెంక ప్రసాద్ యశోద బడ్జెట్ విషయాలను తెలిపాడు. ముందుగా ఈ చిత్రాన్ని రూ.3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలని ప్లాన్ చేసుకున్నాడట. కానీ సినిమా పూర్తయ్యే సరికి ఏకంగా రూ.40 కోట్లు ఖర్చయిందట. ఈ కథకు గ్లోబల్ అప్పీల్ ఉందని భావించినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమా అందరికి రీచ్ కావాలని ఉద్దేశంతో భారీ స్కేల్లో రూపొందించినట్లు తెలిపాడు.
అయితే ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఒక సినిమా రూ.10 కోట్లు బ్రేక్ ఈవెన్ సాధించడమే కష్టంగా ఉంది. అలాంటిది యశోద రూ.40 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. కాగా కంటెంట్ ఉంటే కలెక్షన్లు అవే వస్తాయి అని పలువురు వెల్లడిస్తున్నారు. ఇక ఇటీవలే సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయినా కాని సమంత యశోద ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాపై తనకున్న ప్రేమను చాటుకుంటుంది.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. అయితే ఈ చిత్రం ఆగస్టు 12నే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మూడు నెలలు పోస్ట్ పోన్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

