Love Today Movie | తెలుగులో రిలీజ్ కానున్న.. రీసెంట్ తమిళ్ బ్లాక్‌బస్టర్?
Love Today Movie Telugu Release | ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయి ఘన విజయాలు సాధించాయి.
Love Today Movie Telugu Release | ఈ మధ్య కాలంలో భాషతో సంబంధంలేకుండా కథ, కథనం కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అయి ఘన విజయాలు సాధించాయి. ఈ క్రమంలో ఓ తమిళ సినిమా డబ్బింగ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవలే తమిళంలో రిలీజై బ్లాక్ బస్టర్ వసూళ్ళతో దూసుకుపోతున్న ‘లవ్ టుడే’ సినిమా తెలుగు విడుదలకు ముస్తాబవుతుంది.
ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో నవంబర్ 4న రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా తెలుగు హక్కులను దిల్‌రాజు దక్కించుకున్నట్లు టాక్. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 18న రిలీజ్ చేయాలని దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇద్దరు ప్రేమికులు వాళ్ల ప్రేమను పెళ్ళివరకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో అబ్బాయి, అమ్మాయి వాళ్ల నాన్నతో పెళ్లి గురించి మాట్లాడాలని ఆయన్ని కలుస్తాడు. అయితే అమ్మాయి తండ్రి వీళ్ళిద్దరికి ఓ టెస్ట్ పెడతాడు. వీరిద్దరిని ఒకరి ఫోన్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోని ఒక రోజు ఉండమంటారు. మరుసటి రోజు కూడా పెళ్ళి చేసుకుందాం అనుకుంటే నాకు ఓకే అని చెప్తాడు. దాంతో ఈ ఇద్దరు ప్రేమికులు బయపడుతూనే ఒకరి ఫోన్ మరోకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత మెల్లిగా ఒకరి పర్సనల్ విషయాలు మరోకరికి తెలిసిపోతుంటాయి. ఈ క్రమంలో వారిద్ధరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలు పెళ్లి వరకు తీసుకెళ్తాయా.. లేదా మధ్యలోని పెళ్లి పెటాకులవుతుందా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా రవి హీరోయిన్గా నటించింది. సత్యరాజ్, రాధికా కీలకపాత్ర పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

