Lohithaswa Prasad Passes Away | సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లోహితస్వ ప్రసాద్(80) మృతిచెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లోహితస్వ ప్రసాద్ మంగళవారం బెంగుళూరులోని ప్రైవేట్ హస్పిటల్లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు. ఈయన మరణం పట్ల కన్నడ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. లోహితస్వ ప్రసాద్ కన్నడలో 500పైగా సినిమాల్లో నటించాడు. అలాగే పలు సీరియల్స్‌లోనూ నటించాడు.
ఇండస్ట్రీకి రాకముందు లోహితస్వ ప్రసాద్ ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. ‘ఏకే47’, ‘దాదా’, ‘దేవ’, ‘నీ బరేడ కాదంబరి సంగ్లియానా’ వంటి సినిమాలతో కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అంతిమ రాజా’, ‘గ్రుహంబంగ’, ‘మాల్గుడి డేస్’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులలో కూడా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఈయన కొడుకు శరత్ లోహితస్వ కూడా నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. ఈయన ‘అఖండ’ సినిమాలో NIA ఆఫీసర్‌గా నటించాడు. వీటితో పాటు ‘సాహో’, ‘అరవింద సమేత’, ‘జై లవకుశ’ వంటి సినిమాల్లో కూడా నటించాడు.