Arjun Sarja-Vishwaksen | యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్‌తో ఓ సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్య ఈ చిత్రంలో కథానాయిక. జూన్‌లో పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ చిత్రం ఇటీవలే అర్జున్-విశ్వక్‌కు మధ్య విభేదాలు రావడంతో కాన్సిల్ అయింది. గత మూడు, నాలుగు రోజుల నుండి టాలీవుడ్లో ఇదే చర్చ నడుస్తుంది. అర్జున్, విశ్వక్ సేన్‌కు కమిట్మెంట్ లేదని, తన 40ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్లో ఇలాంటి వ్యక్తిని చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విశ్వక్ కూడా స్పందించి నా అంత కమిటెడ్ ఎవరు ఉండరని, తను కొన్ని చేంజెస్ చెప్తే చెయలేదని, అయినా తన వల్ల ఇబ్బంది ఉంటే క్షమించండి అని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ వివాదం కాస్త చల్లబడింది. అయితే ఈ సినిమాకు నెక్స్ట్ హీరో అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరో గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అర్జున్ ఈ చిత్రాన్ని శర్వానంద్‌తో తెరకెక్కించాలని ఆసక్తి చూపుతున్నాడట. ఈ కథ శర్వాకు బాగా సెట్టవుతుందని భావిస్తున్నాడుట. అంతేకాకుండా త్వరలోనే శర్వాతో ఈ సినిమా గురించి చర్చించనున్నట్లు టాక్. అయితే శర్వా ఇటీవలే ఒకే ఒక జీవితంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. దాదాపు ఆరు ఫ్లాపుల తర్వాత ఈ సినిమా శర్వాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో శర్వా కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడట. కథను ఒకే చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడట. ఈ క్రమంలో అర్జున్ కథను శర్వా యాక్సెప్ట్ చేస్తాడా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అందులోనూ ఇంత పెద్ద వివాదం తర్వాత అర్జున్‌కు ఓకే చెప్తాడా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది.
ప్రస్తుతం శర్వా ఛల్ మోహన్‌రంగ ఫేం కృష్ణ చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. దీనితో పాటు మరో ఇద్దరు యంగ్ దర్శకులకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.