టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త్వరలోనే వాల్తేరు వీరయ్యగా సందడి చేసేందుకు రెడీ అంటున్నాడు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను హుషారెత్తిస్తున్నాడు చిరంజీవి. తాజాగా స్టైలిష్ లుక్ ఒకటి నెట్టింట్లో షేర్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ టీం.
చుట్టూ గన్స్.. మధ్యలో స్టైలిష్ గాగుల్స్ తో స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు వాల్తేరు వీరయ్య . తాజా లుక్‌తో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేస్తున్నాడు చిరు. ఈ లుక్ ఏ సీన్‌కు సంబంధించింది అయి ఉంటుందా..? అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్యలో రవితేజ ఏసీపీ విక్రమ్‌సాగర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రెండింగ్ అవుతోంది.
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. శృతిహాసన్, చిరంజీవి మధ్య వచ్చే డ్యుయెట్ సాంగ్ త్వరలో మీ ముందుకు రాబోతుందని వచ్చిన లీక్ నెట్టింట వైరల్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
వాల్తేరు వీరయ్య స్టైలిష్ లుక్..
Presenting the #MassMoolavirat of Indian Cinema in his massiest avatar as #WaltairVeerayya 🔥#PoonakaluLoading this Sankranthi💥#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/Mawivk20Ua— Mythri Movie Makers (@MythriOfficial) December 16, 2022
రవితేజ ఏసీపీ విక్రమ్‌సాగర్ వర్కింగ్ స్టిల్స్..
Mass Maharaja @RaviTeja_offl's working stills from the sets of #WaltairVeerayya 🔥
Have you met Vikram Sagar ACP yet?
– https://t.co/DJU6adONHa#WaltairVeerayyaOnJan13thMega⭐ @KChiruTweets @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/YgkUrepYpR
— Mythri Movie Makers (@MythriOfficial) December 14, 2022
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..
Read Also : Avatar : The Way Of Water | తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ?
Read Also : Dil Raju | వారసుడు ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదట.. ఇంతకీ ఎవరో చెప్పిన దిల్ రాజు
Read Also : Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. కమల్‌హాసన్ డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. !
Read Also : Venkatesh | వెంకటేశ్‌ను ఇంప్రెస్ చేయలేకపోతున్న డైరెక్టర్లు.. స్టోరీ రైటర్ కావాలట..!