Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అతడు నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవ్వడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ థియేటర్లలో పండగా చేసుకున్నారు. కొన్ని రోజులుగా మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లన్ని ఇంద్ర ఎఫెక్ట్‌తో తెరచుకున్నాయి. అయితే ఈ సినిమా రీ రిలీజ్ అయ్యిందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారికి మరో క్రేజీ అప్డేట్ను ఇచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే కానుకగా ఈ విషయాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి – వైజయంతీ మూవీస్ బ్యానర్లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘జై చిరంజీవ’ వంటి నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. త్వరలోనే మెగాస్టార్‌తో ఐదవ సినిమా ఉండబోతుంది అంటూ వైజయంతీ మూవీస్ నిర్మాత అశ్విని దత్ ప్రకటించాడు.
Also Read..