Rajinikanth – Mari Selvaraj | ‘పరియేరుమ్ పెరుమాళ్’ దర్శకుడితో రజినీకాంత్ సినిమా.?
Rajinikanth - Mari Selvaraj | గతేడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే జైం భీమ్‌తో హిట్ అందుకున్న టీజే జ్ఞానవేల్‌తో 'వేట్టయాన్' అనే సినిమాను విడుదలకు రెడీ చేసిన తలైవర్ ఈ చిత్రం అనంతరం లోకేష్ కనగరాజ్‌తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.
Rajinikanth – Mari Selvaraj | గతేడాది ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ‘జైం భీమ్’తో హిట్ అందుకున్న టీజే జ్ఞానవేల్‌తో ‘వేట్టయాన్’ అనే సినిమాను విడుదలకు రెడీ చేసిన తలైవర్ ఈ చిత్రం అనంతరం లోకేష్ కనగరాజ్‌తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాల అనంతరం మరో క్రేజీ దర్శకుడితో రజినీ చేతులు కలపబోతున్నాడు.
‘పరియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’, ‘మామన్నన్ ‘ సినిమాలతో హిట్లు అందుకున్న దర్శకుడు మారి సెల్వరాజ్‌తో రజినీ తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే దీని గురించి దర్శకుడు మారి సెల్వరాజ్ మాట్లాడుతూ.. రజనీ కాంత్‌కు నేను అంటే ఇష్టం. అతడు నా గత సినిమాలు చూశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో మేమిద్దరం కలిసి ఓ చిత్రం చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే కథా చర్చలు జరుగుతున్నాయి అంటూ తెలిపాడు మారి. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావడానికి మరిన్ని రోజులు పట్టేలా ఉంది. మారి సెల్వరాజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వాలై(vaazhai) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Also Read..
- Suicide attempt | తిరుపతి శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రేమ జంట ఆత్మాహత్యాయత్నం
- Kolkata woman doctor death | నిందితుడు సంజయ్ రాయ్‌కి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- Girl gang raped | ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై సామూహిక అత్యాచారం.. బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

