భీమ్లా నాయక్ సినిమాలో వీవీ వినాయక్.. కానీ ఎడిటింగ్‌లో షాక్..
VV Vinayak in Bheemla Nayak Movie | భీమ్లా నాయక్ సినిమాలో టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్ ఉన్నాడు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇది నిజం. ఈ సినిమాలో తాను నటించినట్టు స్వయంగా వినాయక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే సినిమా విడుదలైన తర్వాత చూస్తే ఆయన సన్నివేశాలు లేవు. ఎడిటింగ్ టేబుల్ మీద త్రివిక్రమ్ దగ్గరుండి చాలా వరకు సీన్స్ కట్ చేశాడు. అందులో చాలా వరకు సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాలో అత్యంత కీలకంగా ఉండే రానాకు పవన్ కళ్యాణ్ బైక్ లిఫ్ట్ ఇచ్చే సన్నివేశం కూడా ఎడిటింగ్‌లో వెళ్లిపోయింది.
దాంతో పాటు మరిన్ని సీన్స్ కూడా నిర్దాక్షిణ్యంగా ఎడిటింగ్ టేబుల్‌పై కోసి పారేశాడు మాటల మాంత్రికుడు. అందులో ఆయన ప్రాణ స్నేహితుడు సునీల్ నటించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలోనే వీవీ వినాయక్ కూడా ఉన్నాడు. సినిమా చూసిన వాళ్లకు రానా మొదటిసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సీన్ గుర్తుండే ఉంటుంది. అప్పుడు మిగిలిన పోలీసులు రానా ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వీవీ వినాయక్ అన్న కాలింగ్ అంటూ వస్తుంది. దానిపై పోలీసులు ఫన్ కూడా చేస్తారు. ఆ తర్వాత ఆయన ఫోన్లో ఇంకా ప్రముఖుల నెంబర్లు బయటపడతాయి. నిజానికి అదే సమయంలో వినాయక్ సన్నివేశం ఒకటి ఉంది కానీ ఎడిటింగ్‌లో దానిని తొలగించారు.
నిజానికి ఈ సినిమాలో దర్శకుడు వినాయక్ నటించినట్టు భీమ్లా నాయక్ టీం ఎక్కడా చెప్పలేదు. నేరుగా వినాయకే ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో తాను దర్శకుడిగానే కనిపించినట్లు తెలిపాడు. కానీ కట్ చేస్తే ఆయన ట్రాక్‌ను ఎడిటింగ్‌లో లేపేశారు. రానా పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వినాయక్ ఫోన్ చేస్తున్నట్టు చూపించి మమ అనేశారు. అలాగే టైటిల్ సాంగ్‌లో సునీల్, హైపర్ ఆది, సప్తగిరి లాంటి వాళ్లు ఉన్నారు. వాళ్లతో ఉన్న సన్నివేశాలు కూడా ఎడిటింగ్‌లో ఎత్తేసారు. ఇన్ని కత్తెర్లు వేశారు కాబట్టే ఒరిజినల్ రెండు గంటల 50 నిమిషాలు ఉంటే తెలుగు వర్షన్ కేవలం రెండు గంటల 25 నిమిషాలు మాత్రమే ఉంది.
Read More :
Bheemla Nayak Director Dance | ‘భీమ్లా’ నాయక్ సాంగ్‌కు డైరెక్టర్ స్టెప్పులేస్తే..వీడియో హల్ చల్”
Trivikram Srinivas | భీమ్లానాయక్లో సునీల్ సీన్లను త్రివిక్రమ్ కట్ చేశాడా..?”
Bheemla Nayak | భీమ్లా నాయక్ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్లనుంది..?”
RGV Bheemla Nayak tweet | పవన్ కల్యాణ్ ఓ సునామి..భీమ్లా నాయక్‌పై ఆర్జీవీ ట్వీట్ వైరల్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

