Trivikram Srinivas | భీమ్లానాయక్లో సునీల్ సీన్లను త్రివిక్రమ్ కట్ చేశాడా..?
భీమ్లా నాయక్ (Bheemla Nayak)లో ఎవరూ ఊహించని విధంగా కమెడియన్ సునీల్ పోలీసాఫీసర్‌గా టైటిల్‌సాంగ్‌లో కనిపిస్తాడని తెలిసిందే. ఈ పాటను బాగా గమనిస్తే సునీల్ (Sunil)పై సినిమాలో కొన్ని సీన్లు కూడా షూట్ చేసినట్టు అర్థమవుతుంది.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) మేనియా కొనసాగుతుంది. విడుదలైన అన్ని సెంటర్లలో తన హవా కొనసాగిస్తోంది. ఈ మూవీలో ఎవరూ ఊహించని విధంగా కమెడియన్ సునీల్ పోలీసాఫీసర్‌గా టైటిల్సాంగ్ లో కనిపిస్తాడని తెలిసిందే. హైపర్ ఆది, సప్తగిరి జైలు ఖైదీల గెటప్‌లో కనిపిస్తారు. విలన్లను భీమ్లా నాయక్ ఎలా పట్టుకున్నాడో ఈ పాటలో వివరిస్తారు. అయితే ఈ పాటను బాగా గమనిస్తే సునీల్ (Sunil)పై సినిమాలో కొన్ని సీన్లు కూడా షూట్ చేసినట్టు అర్థమవుతుంది.
ఫిలింనగర్ లో నడుస్తున్న టాక్ ప్రకారం పవన్ కల్యాణ్ జైలులో ఉన్న తన సహచర పోలీస్ ఆఫీసర్లకు, ఖైదీలకు ఫిలాసఫీని పంచుకునే కొన్ని సీన్లు ముందుగా రాశాడట త్రివిక్రమ్ (Trivikram). సుమారు 20 నిమిషాలపాటు కామెడీ టచ్‌తో సాగే సీన్లుండగా..అయితే ఈ సీన్లు సినిమా ఫ్లోకు ఆటంకం కలిగించేలా ఉంటాయని భావించిన త్రివిక్రమ్ వాటిని కట్ చేశాడట. తనకు ప్రాణ స్నేహితుడైన సునీల్ గురించి కూడా మరో ఆలోచన చేయకుండా అతడికి సంబంధించిన సీన్లు కూడా తీసేశాడని టాక్ నడుస్తోంది.
ఒకవేళ మేకర్స్ అనుకుంటే జైలు ఎపిసోడ్ అన్‌కట్ వెర్షన్ కూడా ఏదో ఒటీటీ ప్లాట్‌ఫాంలో చూపించే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి సునీల్ సీన్లు కట్ చేసిందనే లేటెస్ట్ టాక్‌తో పవన్ అభిమానులు మరింత ఎక్జయిటింగ్ అవుతున్నారు. మరి ఈ న్యూస్ పై రాబోయే రోజుల్లో ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
Vijay Devarakonda | విజయ్ దేవర కొండ న్యూ లుక్..ఈ స్టిల్ ఎక్కడిదంటే..?
Sukumar | సాయిపల్లవి ‘లేడీ పవన్ కల్యాణ్’ ..సుకుమార్ ప్రశంసల జల్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

