పెళ్లిచూపులు సినిమాతో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ అందరిని ఎంటర్టైన్ చేశాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిలా కొత్త యాంగిల్‌ను పరిచయం చేశాడు. ఇపుడు లైగర్ గా డిఫరెంట్ అవతార్‌లో అలరించేందుకు ముస్తాబవుతున్నాడు విజయ్ దేవర కొండ (Vijay Devarakonda). ట్రెండీ అవతార్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు విజయ్ దేవరకొండ. ఎప్పటికపుడు కొత్త కొత్త డ్రెస్సుల్లో కనిపిస్తూ యూత్‌ను అట్రాక్ట్ చేసే ఈ కుర్ర హీరో సడెన్ గా న్యూ లుక్‌లో కనిపిస్తున్నాడు. లైగర్ కోసం లాంగ్ హెయిర్‌ను మెయింటైన్ చేసిన విజయ్ సడెన్‌గా పొట్టి హెయిర్‌తో కనిపించి షాక్‌కు గురిచేస్తున్నాడు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం (Gachibowli Indoor Stadium)లో జరిగిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (Prime Volleyball League)లో ఈ గెటప్‌లో కనిపించాడు. బ్లూ, వైట్ కాంబో షర్ట్, యెల్లో క్యాప్ పెట్టుకుని హమ్ చేస్తున్నట్టు కనిపిస్తున్న విజయ్ దేవరకొండ లుక్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయనుండగా…తాజా అప్ డేట్ ప్రకారం ఏప్రిల్ నెలలో చిత్రీకరణ షురూ కానుంది. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్.
కాగా లైగర్‌ను ధర్మ ప్రొడక్షన్స్ , పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీజగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది.