టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ లో నటించిన భీమ్లానాయక్ (Bheemla Nayak) క్లాస్, మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. తొలి రోజు నుంచి ఇప్పటివరకు కలెక్షన్ల విషయంలో తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే భీమ్లానాయక్ టీం రిలీజ్ రోజు కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకోగా..ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
తాజాగా భీమ్లానాయక్ సక్సెస్ పార్టీకి సంబంధించిన వీడియో (Bheemla Nayak Director Dance) ఒకటి ట్రెండింగ్ అవుతోంది. భీమ్లానాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర (Sagar K Chandra) ఈ పార్టీలో డ్యాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. లాలా భీమ్లా సాంగ్ ప్లే అవుతుండగా..ఓ వైపు త్రివిక్రమ్ అండ్ హమ్ చేస్తుంటే మరోవైపు సాగర్ కే చంద్ర ఇరగదీసే స్టెప్పులేస్తూ అదరగొట్టాడు. డ్యాన్స్ చివరలో భీమ్లానాయక్ హావబావాలను చూపించేందుకు ప్రయత్నిస్తూ సిగ్గపడటం వీడియోలో చూడొచ్చు.
Our Dynamic Director Enjoying #BheemlaNayak Success Party 🔥https://t.co/WhVeVGUbH7 pic.twitter.com/wbjITfbLih
— ᑕᕼᗩᑎᗪᑌ🖤 ™ (@ChanduuPAWANIST) February 27, 2022
ఎన్నో నెలల శ్రమకు ఫలితం హిట్టు రూపంలో రావడంతో త్రివిక్రమ్, సాగర్ అండ్ టీం పార్టీ మూడ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. మలయాళసూపర్ హిట్ అయ్యప్పనుమ్ కొషియుమ్కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, నిత్యమీనన్, సంయుక్తా మీనన్, సముద్రఖని ఇతర కీలకపాత్రలు పోషించారు.