Dekh lenge Saala | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ నెట్టింటిని షేక్ చేస్తోంది.
చాలా కాలం తర్వాత ఈ సాంగ్‌లో పవన్ కల్యాణ్ స్టైలిష్ అవతార్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్, అభిమానులు. పవన్ కల్యాణ్ స్టైలిష్ అవతార్‌కు ఇంప్రెస్ అయిన వారి జాబితాలో పాపులర్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా చేరిపోయాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ వివి వినాయక్‌కు దేఖ్లేంగే సాలా సాంగ్‌ను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు. కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ పవన్ కల్యాణ్‌ను ఇదివరకెన్నడూ చూపించని విధంగా స్టైలిష్‌గా చూపించాడంటూ ప్రశంసలతో ముంచెత్తాడు వివి వినాయక్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
రంపంపం రంపంపం స్టెప్పేస్తే భూకంపం.. దేఖ్ లేంగే సాలా సాంగ్ అంటూ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్‌లోని స్టైలిష్ డ్యాన్స్‌ను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు విజువల్స్ చెప్పేస్తున్నాయి. దేఖ్లేంగే సాలా సాంగ్‌ను భాస్కర బట్ల రాయగా దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో విశాల్ దడ్లానీ పాడాడు. వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం, హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Legendary director #VVVinayak watched #DekhlengeSaala and showered praises on our Cult Captain @harish2you for showing PSPK like never before 💥💥
Listen to #UstaadBhagatSingh first single #DekhlengeSaala🔥
▶️ https://t.co/15RgSHD44gCult Captain @harish2you‘s Feast 💥
A… pic.twitter.com/cezdv5wcUd— BA Raju’s Team (@baraju_SuperHit) December 16, 2025
45 Official Trailer | శివన్న – ఉపేంద్రల మెగా మల్టీస్టారర్.. ’45’ ట్రైలర్ విడుదల