Megastar Chiranjeev | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ టాకీ పార్ట్ పూర్తిచేసుకుందని.. ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఇందులో ఒకటి ఇంట్రో సాంగ్ కాగా.. మరోకటి ఐటమ్ సాంగ్ అని తెలుస్తుంది. వీటితో పాటు క్లైమాక్స్ ఫైట్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలు పెట్టిన ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రోడక్షన్ పనులకు రెడీ అవుతుంది.
ఈ సినిమాలో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపించబోతున్నారు. త్రిష ,ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపింబోతున్నారు.ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్టుగా టాక్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
Also Read..