Vidaa Muyarchi | మగిజ్ తిరుమేని దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) నటిస్తోన్న తాజా చిత్రం విదాముయూర్చి (Vidaa Muyarchi). ఏకే 62గా వస్తోన్న ఈ మూవీలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. అజర్బైజాన్లో అజిత్‌కుమార్ అండ్ టీంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజా షూట్ లొకేషన్ విజువల్స్‌లో కనిపిస్తున్న స్పెషల్ ట్రక్కు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
వైట్ కలర్లో స్పెషల్‌గా కనిపిస్తున్న ఈ ట్రక్కుపై వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి విజువల్స్. మగిజ్ తిరుమేని, అజిత్ టీం గ్రాండ్ సీక్వెన్స్‌నే ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుండగా.. స్టన్నింగ్ యాక్షన్ పార్టు ఉండబోతుందని పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు.యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కసాండ్రా, అరవ్ కిజర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అజిత్ కుమార్ దీంతోపాటు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో నటిస్తున్న ఏకే 63 షూట్లో పాల్గొంటున్నట్టు వార్త రాగా... కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్లు జాన్ అబ్రహాం, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలు వస్తోండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Vidaamuyarchi Shoot spot!#AjithKumarpic.twitter.com/VHKTKZZpAG
— Prakash (@prakashpins) July 18, 2024
Maharaja | తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ సేతుపతి మహారాజ అరుదైన ఫీట్
Krishna Vamsi | రాంచరణ్ రెడీ అయితే నేనూ కూడా రెడీ సార్.. కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్
Double iSmart | బాలీవుడ్లో రామ్ టీం డబుల్ ఇస్మార్ట్ ప్లాన్
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ