Laila | టాలీవుడ్ యాక్టర్ విశ్వక్సేన్ (Vishwaksen) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి రామ్ నారాయణ్ (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న VS12. లైలా టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవలే విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త లుక్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో స్టైలిష్ గాగుల్స్‌లో డ్యుయల్ ప్యాంట్‌తో ట్రెండీగా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సోను మోడల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. నారాయణన్ రవిశంకర్, రేష్మ శ్యామ్ పాడారు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ పాటను విశ్వక్ సేన్ స్వయంగా రాయడం విశేషం. ఈ మూవీని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
లైలా తొలి గులాబి న్యూఇయర్ 2025కు రాబోతుంది. ఈ వాలెంటైన్స్ డేకు ఎంటర్టైనింగ్ బ్లాస్ట్ ఉండబోతుందంటూ విడుదల చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఆకాంక్ష శర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తనిష్క్ బాగ్చి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#Laila first single #SonuModel video song out now ❤️🔥 #Laila @VishwakSenActor
▶️ https://t.co/hPTfoFKqMm pic.twitter.com/TW2bAEgvQ4
— BA Raju’s Team (@baraju_SuperHit) December 29, 2024
సోను మోడల్ వీడియో సాంగ్..
Naga Vamsi | అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కోసం స్పెషల్ స్టూడియో.. నాగవంశీ కామెంట్స్ వైరల్
Second Marriages | 2024 రౌండప్.. రెండోసారి పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!
Nindha | అంతర్జాతీయ స్థాయిలో.. వరుణ్ సందేశ్ నిందకు అరుదైన గుర్తింపు