Nindha | టాలీవుడ్ యాక్టర్ వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటించిన చిత్రం నింద (Nindha). క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీకి రాజేశ్ జగన్నాథం దర్శకత్వం వహించాడు. నింద.. కాండ్రకోట మిస్టరీ క్యాప్షన్‌తో వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ మూవీని ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. జూన్ 21న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సెప్టెంబర్ 6న ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ విజయవంతంగా 35 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. ఈ చిత్రం అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది. నింద ఇక అంతర్జాతీయంగా స్ట్రీమింగ్ కానుంది. ఎమిరేట్స్, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ప్రసారం చేయడానికి ఆమోదం లభించింది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో సందడి చేయబోతుండటం ప్రత్యేకమనే చెప్పాలి.
ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రమ్, చత్రపతి శేఖర్, సిద్ధార్థ్ గొల్లపూడి, శ్రేయా రాణిరెడ్డి, అన్నీ, క్యూ. మధు, సూర్య, అరుణ్ దలై, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు.
Naga Vamsi | అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కోసం స్పెషల్ స్టూడియో.. నాగవంశీ కామెంట్స్ వైరల్
Second Marriages | 2024 రౌండప్.. రెండోసారి పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీలు వీళ్లే..!