Second Marriages | సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఓ వైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ.. మరోవైపు ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగించాల్సి ఉంటుందని తెలిసిందే. అయితే పర్సనల్ లైఫ్‌లో పెళ్లి బంధంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విజయవంతంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నవారు కొందరైతే.. పలు కారణాల వల్ల విడిపోయిన వారు మరికొందరు.
మొదటి పెళ్లి, విడాకుల తర్వాత అక్కడితోనే ఆగిపోకుండా మరోసారి పెండ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారు ఇంకొందరు. మరి 2024లో (Second Marriages) టాలీవుడ్ నుంచి రెండోసారి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలపై ఓ లుక్కేస్తే..
Naga Chaitanya | నాగచైతన్య-శోభితా ధూళిపాళ :
2022లో తొలిసారిగా ఒకరినొకరు కలుసుకున్నారు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య-శోభితా ధూళిపాల. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకలో అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. నాగచైతన్య గతంలో సమంతతో విడాకులు తీసుకోగా.. ఇది రెండో వివాహం.
Siddharth | సిద్ధార్థ్-అదితీ రావు హైదరీ :
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు సిద్దార్థ్, అదితీ రావు హైదరీ. చాలా కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ సెలబ్రిటీలు తెలంగాణ శ్రీరంగాపూర్‌లోని 400 ఏండ్ల పురాతన శ్రీరంగనాయక స్వామి ఆలయంలో సెప్టెంబర 16న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం.
krish jagarlamudi | క్రిష్ జాగర్లమూడి :
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (krish jagarlamudi) హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లా (Priti Challa)ను నవంబర్‌లో పెండ్లి చేసుకున్నాడు.మొదటి భార్య కూడా డాక్టర్ కాగా క్రిష్ ఆమెకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే. క్రిష్‌కు ఇది రెండో పెండ్లి.
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు..!