Naga Vamsi | సిల్వర్ స్క్రీన్స్‌పై కొన్ని కాంబినేషన్లు వస్తున్నాయంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అలాంటి కాంబోల్లో ఒకటి అల్లు అర్జున్ (Allu Arjun) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram srinivas). ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలతో వినోదాన్ని పంచింది. కాగా ఇద్దరి కలయికలో మరో సినిమా రాబోతుందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత దీనికి సంబంధించిన క్రేజీ న్యూ్స్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా తెరకెక్కిస్తుండగా.. ఈ యాక్షన్ డ్రామా 2025 జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు నాగవంశీ. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓస్టూడియోను నిర్మిస్తున్నట్టు చెప్పాడు. కథానుగుణంగా స్టూడియో నిర్మించే ప్లాన్‌లో ఉన్నామన్నాడు. అంతేకాదు బన్నీ నెక్ట్స్ సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ చాలా ఉంటుందని, ఈ నేపథ్యంలో స్టూడియో నిర్మిస్తున్న ఏరియాలో భారీ మొత్తంలో బడ్జెట్ ఖర్చుపెట్టబోతున్నట్టు తెలిపాడు.
నాగవంశీ ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇది పాన్ ఇండియా డెబ్యూ ప్రాజెక్ట్ కాబోతుందట. ఈ సారి త్రివిక్రమ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రెడీ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని ఇన్సైడ్ టాక్.ఈ వార్తలతో బన్నీ కొత్త సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు..!