Vishu Vishal | తమిళ నటుడు విష్ణు విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాట్సాసన్ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో మంచి గుర్తింపు సాధించాడు. ఈ సినిమా అనంతరం ఎఫ్ఐఆర్ అంటూ వచ్చి మరో సైపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా అనంతరం లాల్ సలామ్ అంటూ ప్రేక్షకులు ముందుకు రాగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది. అయితే చాలా రోజుల తర్వాత ఆయన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆర్యన్’ (Aaryan). ఈ సినిమాకు కె.ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్ కథానాయికలుగా నటిస్తుండగా.. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్, సాయిరోనక్, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు విశాల్ బర్త్ డే సందర్భంగా.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా సీరియస్ లుక్‌లో కనిపించారు. ‘వినూత్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకి సంగీతం సామ్ సిఎస్ అందిస్తున్నాడు.
Wishing our resilient and dashing hero @TheVishnuVishal a very happy birthday! 🥳 We take immense pleasure in collaborating with him on this most anticipated project, #Aaryan.#VV#VishnuVishal#Aaryan#HBDVishnuVishal pic.twitter.com/s9MxuUMzUQ
— BA Raju’s Team (@baraju_SuperHit) July 17, 2024
Also Read..