Jammu Kashmir: భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య దోడాలో రెండుసార్లు కాల్పులు
Jammu Kashmir: భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఇవాళ దోడా జిల్లాలో ఫైరింగ్ జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే రెండుసార్లు కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో.. విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా ఫైరింగ్‌కు పాల్పడ్డారు.
జమ్మూ: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని దోడా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఇవాళ ఫైరింగ్ జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే రెండుసార్లు కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో.. విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా ఫైరింగ్‌కు పాల్పడ్డారు. గాండో ఏరియా నుంచి రెండు పేలుడు పదార్ధాలను రికవర్ చేశారు. మంగళవారం రాత్రి 10.45 నిమిషాలకు తొలుత కలాన్ భాటా ప్రాంతంలో ఫైరింగ్ జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామున రెండు గంటలకు పంచాన్ భాటాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. దేసా ఫారెస్ట్ ఏరియాలో ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగు భారత జవాన్లు వీరమరణం పొందారు.
ఇవాళ జరిగిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. చీకట్లో ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు చెప్పారు. దేసా ఫారెస్ట్ బెల్ట్‌లో ఉన్న ధారి గోటే ఉరార్బాగి ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు చెందిన దళాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. చాలా కఠినమైన కొండ ప్రాంతాలు, వెదర్ వల్ల .. ఉగ్రవాదుల ఏరివేత సమస్యాత్మకంగా మారింది. సోమవారం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌తో లింకు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
సోమవారం కాల్పుల్లో మరణించిన వాళ్లలో డార్జిలింగ్‌కు చెందిన కెప్టెన్ బ్రిజేశ్ థాపా, ఏపీకి చెందిన నాయక్ డీ రాజేశ్, రాజస్థాన్‌కు చెందిన సిపాయిలు బిజేంద్ర, అజయ్ కుమార్ సింగ్ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ సంస్థకు షాడో గ్రూపు ‘ది కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

