Madha Gaja Raja twitter Review | తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో ఒకరు విశాల్ (Vishal). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన లాంగ్ టైం పెండింగ్ సినిమా మద గజ రాజ (Madha Gaja Raja). ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంతానం, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ తెరకెక్కించిన ఈ మూవీకి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు.
యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో సుందర్ సీ డైరెక్ట్ చేసిన మద గజ రాజ నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2013 పొంగళ్ కానుకగా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ.. 12 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఫైనల్‌గా థియేటర్లలోకి వచ్చింది. దశాబ్ధ కాలంలో సినిమాలు తెరకెక్కించే విధానం, ప్రేక్షకుల అభిరుచులు మారిన నేపథ్యంలో మరి మద గజ రాజపై నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేస్తే..
నెటిజన్ల టాక్, ట్విట్టర్ రివ్యూ ఇలా..
Night premiere chusanu #MadhaGajaRaja 😎😂👌🏻👌🏻
Santhanam and Vishal comedy timing 💯🔥
Extraordinary dubbing 💯😎Overall a full entertainment movie 🎥 @yoursanjali garu & @varusarath5 garu really looks gorgeous 😻🥰
My review for the movie 3/5 ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/uTHK1E157M
— Rebal Relangi (@RebalRelang) January 31, 2025
సంతానం, విశాల్ కామెడీ టైమింగ్ బాగుంది. డబ్బింగ్ అద్భుతమని చెప్పాలి. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ చాలా అందంగా కనిపించారు. మొత్తానికి పసందైన వినోదాన్ని అందించే సినిమా.
పక్కా ఎంటర్టైనింగ్ సినిమా.. అస్సలు మిస్సవద్దు. విశాల్, సంతానం కామెడీ వేరే లెవల్లో ఉంటుంది.
#Madhagajaraja continues its unstoppable run at the box office, crossing ₹60+ Crores worldwide🎉💥
The action-packed entertainer is winning hearts and breaking records 📽️🔥#ActorVishal @khushsundar pic.twitter.com/km51DRlHBw
— Actor Kayal Devaraj (@kayaldevaraj) January 31, 2025
బాక్సాఫీస్ వద్ద అన్‌స్టాపబుల్ రన్‌తో వరల్డ్‌వైడ్‌గా రూ.60 కోట్లు అధిగమించింది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా అందరి మనస్సును గెలుచుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తుంది.
Night premiere chusa
Santhanam vintage Comedy bagundhi
Vishal comedy & action blocks 🔥@yoursanjali @varusarath5 gari glamorous 😍
Must watch in near your theaters #MadhaGajaRaja pic.twitter.com/EtOs0RtA2d— 000009 (@ui000009) January 31, 2025
సంతానం వింటేజ్ కామెడీ బాగుంది. విశాల్ కామెడీ, యాక్షన్ బ్లాక్స్ ఫైర్ మూడ్‌లో సాగుతాయి.
#MadhaGajaRaja is a full-on entertainer packed with fun from start to finish! Centered around friendship and family, it keeps you engaged till the very end. The #Vishal & #Santhanam duo entertains with their impeccable comic timing.
Go & Watch With Famiilies !! pic.twitter.com/uESLWJLAsM
— Filmy Tollywood (@FilmyTwood_) January 31, 2025
మొదలైనప్పటి నుంచి శుభం కార్డు పడే దాకా.. స్నేహం, కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో వినోదాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తుంది. విశాల్, సంతానం కామిక్ టైమింగ్‌తో డబుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా.
మదగజరాజా ఓ పదేళ్ల క్రితం రావాల్సిన సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత విడుదల కావడం వల్ల కథ కొంచెం రొటీన్‌గా అనిపించినా.. ఎక్కడా నిరాశ పరచదు. సంతానం డైలాగ్‌లు, విశాల్ కామిక్ టైమింగ్‌తో పన్ రైడ్‌గా సాగుతుంది.
Night premiere chusa 💫
Comedy bagundhi 👍
12 years back vachi untey industry hit ayyedhi#MadhaGajaRaja pic.twitter.com/HHnM54EdGL
— 😴 (@LaluDhfm_4005) January 31, 2025
కామెడీ బాగుంది . 12 ఏండ్ల క్రితం వచ్చి ఉంటే హిట్టయ్యేది.
#MadhaGajaRaja: BLOCKBUSTER ENTERTAINER 💯
With non-stop #Santhanam-style punches, #Vishal’s vintage energy and action, and the glamour of #Anjali & #Varalaxmi, this film is a complete entertainer! #SundarC once again proves why he’s the king of entertainment with this… pic.twitter.com/4SFuCiz5EL
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) January 31, 2025
సంతానం నాన్‌స్టాప్ స్టైల్ పంచ్‌లు, విశాల్ వింటేజ్ ఎనర్జీ, యాక్షన్, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ గ్లామర్ కలబోతతో సాగే బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్. సుందర్ సీ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మరోసారి రుజువైంది.
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!