12 ఫెయిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టాక్టిక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా బాలీవుడ్ ప్రముఖుల వలే పీఆర్ గేమ్ ఆడటానికి తాను పార్టీలకు వెళ్ళడం, డిజైనర్ దుస్తులు ధరించడం వంటివి చేశానని, కానీ అందులో తాను ఫెయిల్ అయ్యానని చెప్పుకోచ్చాడు.
ఇటీవల రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్న విక్రాంత్.. మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో పీఆర్ ఒత్తిళ్ల గురించి పంచుకున్నారు. అందరిలాగే తాను కూడా పీఆర్ టాక్టిక్స్‌తో ఫేమస్ అవ్వాలని.. ట్రెండింగ్‌లో ఉండాలని అనుకున్నాను. దానికోసం దాదాపు 6 నెలలు తెలియని పార్టీలకు అటెండ్ అవ్వడం.. దుస్తులను అద్దెకు తీసుకోవడం వంటివి చేశాను. ఒక రోజు ఈవెంట్‌కి దాదాపు 50-60 వేలు ఖర్చయ్యేది. అప్పుడు నా భార్య నన్ను చూసి.. ఎందుకు ఇలా చేస్తున్నారు. మీరు వేసుకునే డిజైనర్ దుస్తులు మా నెల ఖర్చులకు సరిపోతాయని చెప్పింది. దాంతో నేను మళ్లీ అటువైపు వెళ్లలేదు. ముఖ్యంగా 4 – 5 గంటలు వేసుకోవడానికి తెచ్చుకున్న డిజైనర్ దుస్తులు ధరించిన అనంతరం ఎక్కడ మరకలు పడతాయో అని భయం ఉండేదంటూ విక్రాంత్ తెలిపాడు.
Read More