న్యూఢిల్లీ: ఢిల్లీ(Delhi)లోని వసంత్ కుంజ్‌కు చెందిన ఓ అమ్మాయి.. యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. రిలేషన్లో ఉన్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహమ్మద్ రెహన్‌ను అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిపై అతను లైంగిక దాడి చేశాడు. అభ్యంతరకరమైన ఫోటోలను పంపుతూ బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 18వ తేదీ అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. యాసిడ్ తాగిన ఆ అమ్మాయిని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే స్టేట్మెంట్ ఇచ్చేందుకు అప్పుడు ఆమె అన్‌ఫిట్‌గా ఉండడంతో.. నేరం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ అమ్మాయి ఇంటి నుంచి యాసిడ్ బాటిల్‌ను రికవరీ చేశారు. రిహన్తో రిలేషన్లో ఉన్న ఆ అమ్మాయి మానసిక వత్తిడికి లోనైనట్లు డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. అమ్మాయి మొబైల్ ఫోన్‌ను ఆమె తండ్రి తమకు అప్పగించినట్లు పోలీసులు చెప్పారు. దాంట్లో వాయిస్ రికార్డులు ఉన్నాయి.
మొబైల్లో ఉన్న వాయిస్‌పై ఫోరెన్సిక్ బృందం విశ్లేషణ చేపట్టింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 60, పోక్సోలోని సెక్షన్ 6 ప్రకారం కేసు బుక్ చేశారు. వసంత్ కుంజ్ పోలీసు స్టేషన్లో కేసు బుక్కైంది. రిహన్ 12వ తరగతి చదువుకున్నాడు. ఎయిర్‌పోర్టులో లోడర్‌గా వర్క్ చేశాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.