Vishwambhara | తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీలలో ‘విశ్వంభర’ (Vishwambhara) ఒకటి. అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా గడుపుతుంది. సినిమా టీజర్‌పై విపరీతంగా ట్రోల్స్ రావడంతో గ్రాఫిక్స్‌పై మరింత కష్టపడుతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్‌కి సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్‌గా మారింది. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులను హాలీవుడ్‌కి చెందిన వీఎఫ్ఎక్స్ స్టూడియోకి అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ హాలీవుడ్ స్టూడియో విశ్వంభర సినిమాకు సాలిడ్ అవుట్ పుట్ని అందించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పనులు కంప్లీట్ అయిన అనంతరం సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు ఒక సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు.