Veera Dheera Sooran | అభిమానులకు వినోదాన్ని అందించడమే టార్గెట్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ (Vikram). ఈ స్టార్ హీరో నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి వీరధీరసూరన్ (VeeraDheeraSooran). ఛియాన్ 62గా వస్తోన్న ఈ మూవీకి చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తూ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సాగుతూ నెట్టింట టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
వీర ధీర సూరన్ జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే బ్యానర్లు ఏంటనే అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఏపీలో శ్రీలక్ష్మి మూవీస్, తెలంగాణలో ఎన్వీఆర్ బ్యానర్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ మూవీలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్ దీంతోపాటు గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం: యుద్ద కాండం (Dhruva Natchathiram) మూవీలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అయితే మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
We are elated to announce that @NVRCinema @SriLakshmiMovie has bagged the Andhra Pradesh – Telangana rights of @chiyaan s #VeeraDheeraSooran 💽 🎼
An #SUArunkumar Picture 🎬
A @gvprakash Musical 🎵🎶🎼
Produced by @hr_pictures @riyashibu_@iam_SJSuryah #surajvenjaramoodu… pic.twitter.com/SU5zUBarTT— HR Pictures (@hr_pictures) January 9, 2025
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్
Sai kumar | మీ ప్రేమకు సదా రుణపడి ఉంటా.. 50 ఏండ్ల సినీ ప్రస్థానంపై సాయికుమార్