Veera Dheera Sooran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ (Vikram) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి వీర ధీర సూరన్ (Veera Dheera Sooran). చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఛియాన్ 62 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విడుదల అప్డేట్ రానే వచ్చింది. ఫైనల్‌గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌తో పోటీ పడేందుకు రెడీ అయ్యాడు విక్రమ్.
మన కాళి మార్చి 27న మిమ్మల్ని థియేటర్లలో కలిసేందుకు వస్తున్నాడు. డేట్‌ను గుర్తు పెట్టుకోండి. చియాన్ ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్ చూసేందుకు రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో సల్లూభాయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న సికిందర్ మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మరి విక్రమ్, సల్మాన్ ఖాన్ సినిమాల మధ్య బాక్సాఫీస్ పోరు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
మోహన్ లాల్ లూసిఫర్ 2, మ్యాడ్ 2, నితిన్ రాబిన్ హుడ్ కూడా మార్చిలోనే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఆయా సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీర ధీర సూరన్లో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Epic Battle Brewing at the Box-Office : @Mohanlal v/s @chiyaan on March 27#Empuraan clashes with #VeeraDheeraSooran pic.twitter.com/kNsuri0b1q
— Sreedhar Pillai (@sri50) January 22, 2025
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?