Veera Dheera Sooran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ వీరధీరసూరన్ (Veera Dheera Sooran). చిత్త (చిన్నా) ఫేం ఎస్‌యూ అరుణ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఛియాన్ 62గా వస్తోన్న ఈ సినిమా పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో విక్రమ్ అభిమానులకు కావాల్సిన వినోదం అందించబోతున్నట్టు టైటిల్ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది.
కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల్లో డైలామా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ సస్పెన్స్‌కు విక్రమ్ టీం పుల్‌స్టాప్ పెట్టేసింది. ఫైనల్‌గా మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తాజా వార్తతో ఇక త్వరలోనే విక్రమ్ థియేటర్లలోకి రాబోతున్నాడని క్లారిటీ రావడంతో అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విక్రమ్ మరోవైపు గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం: యుద్ద కాండంలో నటిస్తున్నాడని తెలిసిందే. పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
#VeeraDheeraSooran March 27th
Tamil & Telugu Theatrical Release 💥 pic.twitter.com/9bF5Dz51Gd
— Karthik Ravivarma (@Karthikravivarm) February 24, 2025
Dragon | డ్రాగన్ అందమైన సినిమా.. డైరెక్టర్ శంకర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ రియాక్షన్ ఇదే
Toxic The Movie | ఒకేసారి రెండు భాషల్లో.. తొలి భారతీయ సినిమాగా యశ్ టాక్సిక్ అరుదైన ఫీట్..!