Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కాంపౌండ్ నుంచి వచ్చిన హిస్టారికల్ డ్రామా తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 15న తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విక్రమ్ అడ్వెంచరస్ యాక్టింగ్‌కు మూవీ లవర్స్ ఫిదా అయిపోగా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి వార్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. విక్రమ్, మాళవికా మోహనన్ తమ సైన్యంతో కలిసి చేసే యుద్దం నేపథ్యంలో సాగుతున్న ఈ పాటకు నెట్టింట వైరల్ అవుతోంది. విక్రమ్ నుంచి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్‌తో సాగుతున్న ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగే వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే ఈ చిత్రం థ్రిల్లింగ్, అడ్వెంచరస్ రైడ్‌గా సాగుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతలా ప్రాణం పెట్టాడో ఇప్పటికే రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. తంగలాన్ నుంచి లాంచ్ చేసిన విక్రమ్, మాళవికా మోహనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ చిత్రం బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ స్టోరీ నేపథ్యంలో ఉండనుందని ఇప్పటికే లాంఛ్ చేసిన తంగలాన్ గ్లింప్స్ చెబుతోంది.
Witness the pursuit of gold become the symphony of courage 🔱
Watch #ThangalaanWarSong video ▶️
Telugu : https://t.co/cAYoyQS8SR
A @gvprakash Musical 🎶#Thangalaan – In Cinemas Now@Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe @StudioGreen2 @officialneelam @parvatweets… pic.twitter.com/FAxkJGvc3R
— BA Raju’s Team (@baraju_SuperHit) September 5, 2024
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!