Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం తంగలాన్ (Thangalaan). హిస్టారికల్ డ్రామాగా పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 15న తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రీమియర్ అప్డేట్ వచ్చేసింది. 100 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీలో తంగలాన్‌కు ప్రేక్షకులను ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
ఇంకేంటి తంగలాన్పై మీరూ లుక్కేయండి. ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
A quest for gold and justice buried deep in the pages of history!
Stream the epic #Thangalaan, now on @netflix ️🔥@Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe @StudioGreen2 pic.twitter.com/bUmooKVXYK
— BA Raju’s Team (@baraju_SuperHit) December 10, 2024
Fear Trailer | సైలెంట్‌గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్‌గా వేదిక ఫియర్ ట్రైలర్