The Greatest of all time | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). దళపతి 68 (Thalapathy 68)గా వస్తోన్న ఈ మూవీని వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తు్న్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర అప్డేట్ అందించాడు డైరెక్టర్. సినిమా రీరికార్డింగ్ పనులు షురూ అయ్యాయి.
ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు వెంకట్ ప్రభు. ఈ స్టార్ దర్శకుడు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కంపోజిషన్ వర్క్‌లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కిచ్చా సుదీప్ , ప్రశాంత్, ప్రభుదేవా, జయరాం, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేశ్, అజ్మల్ అమీర్, మిక్ మోహన్, ప్రేమ్గీ, అజయ్ రాజ్, అరవింద్ ఆకాశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The GOAT నుంచి మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ సినిమాను వివిధ భాషల్లోకి అనువదించనున్నాం. ఈ కారణంగా సెప్టెంబర్‌లో సినిమా రాబోతుందని ఇప్పటికే వెంకట్ ప్రభు తెలియజేశాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన Chinna Chinna Kangalకు మంచి స్పందన వస్తోంది.
#TheGreatestOfAllTime – The Magician has Started his work..🔥 – Venkat Prabhu on insta
Third Single on the Way..⭐ pic.twitter.com/h2yADseIe0
— Laxmi Kanth (@iammoviebuff007) July 25, 2024
SK23 | మురుగదాస్-శివకార్తికేయన్ ఎస్కే 23 టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Raayan Review | ధనుష్ రాయన్గా మెప్పించాడా.. పర్ఫెక్ట్ బెంచ్‌మార్క్ సినిమానా.. ?
Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్‌లో కాసర్ల శ్యామ్ పాట.. హైప్ క్రియేట్ చేస్తున్న ఎస్ థమన్