Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం దళపతి 69 (Thalapathy 69). హెచ్ వినోథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే పొలిటికల్ జర్నీ గ్రాండ్‌గా మొదలుపెడుతూ మొదటి బహిరంగ సభ ఏర్పాటు చేసి.. అభిమానులు, ఫాలోవర్లలో జోష్ నింపాడు.
తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానులను పుల్ ఖుషీ చేస్తోంది. దళపతి 69 కొత్త షెడ్యూల్ నేడు గ్రాండ్‌గా షురూ కానుంది. ఇంకేంటి మరి 2025 దీపావళి బ్లాస్ట్‌కు రెడీగా ఉండండి. ఇప్పటికే దళపతి 69 టీంలోకి ఒక్కొక్కరికీ స్వాగతం పలుకుతూ విజయ్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు డైరెక్టర్.
ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో.. చివరి సినిమా కానుందని తెలిసిందే. మరి విజయ్ లాస్ట్ సినిమా ఎలాంటి జోనర్లో ఉండబోతుందో అంటూ.. ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Next Schedule Begins Today 😍🔥
All Set for a 2025 DIWALI BLAST 🔥🎇 pic.twitter.com/pBSYtN1Fnk
— Arun Vijay (@AVinthehousee) November 4, 2024
Rashmika Mandanna | దీపావళి బొనాంజా.. స్త్రీ ప్రాంఛైజీలో రష్మిక మందన్నా.. వివరాలివే