Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. హెచ్ వినోథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న దళపతి 69 (Thalapathy 69) గ్రాండ్‌గా లాంఛ్ అయింది. చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమంలో సినిమా మొదలైంది. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీడియోల్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. టీం మెంబర్స్‌కు ఒక్కొక్కరికీ స్వాగతం పలుకుతూ విజయ్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు డైరెక్టర్.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఇదే చివరి కానుంది. ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
దళపతి 69 మూవీ లాంచ్ స్టిల్స్..
#Thalapathy69 Aarambam 💥🔥 pic.twitter.com/kphWi0CFuv
— Christopher Kanagaraj (@Chrissuccess) October 4, 2024
A star studded #Thalapathy69 Pooja Ceremony took place today in Chennai #Thalapathy @actorvijay pic.twitter.com/usCafNAYb4
— BA Raju’s Team (@baraju_SuperHit) October 4, 2024
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3