Vijay | ది గోట్ సినిమా సక్సెస్‌తో జోష్ మీదున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నెక్ట్స్ ప్రాజెక్ట్ దళపతి 69 (Thalapathy 69) కూడా ప్రకటించాడని తెలిసిందే. హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి విజయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
విజయ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతుండటంతో దళపతి 69 సినిమా కెరీర్లో చివరిది కానుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా దళపతి కెరీర్లో ల్యాండ్ మార్క్‌లా నిలిచిపోయేలా ఉండబోతున్న ఈ చిత్రానికి విజయ్ తీసుకుంటున్న పారితోషికం గురించే ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది. తాజాగా ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ.275 కోట్లు తీసుకుంటున్నాడట.
ఇదే నిజమైతే అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫేం రాబర్ట్ రెమ్యునరేషన్ 20 మిలియన్ డాలర్లు (రూ.168 కోట్లు) కంటే విజయ్ తీసుకుంటున్న అమౌంట్ చాలా ఎక్కువన్నమాట. ప్రస్తుతానికి ఈ వార్తలు అఫీషియల్ కాకున్నా.. విజయ్ హాలీవుడ్ స్టార్‌ను మించి తీసుకుంటున్నాడన్న టాపిక్ మాత్రం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. విజయ్ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల గ్రాస్‌ను స్థిరంగా చూపిస్తూనే ఉన్నాడు. మరి దళపతి 69 ఈ మార్క్‌ను దాటిపోతుందా..? అనేది సర్వత్రా క్యూరియాసిటీ పెంచేస్తోంది.
దళపతి 69లో ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది విజయ్ టీం.
VidaaMuyarchi | డైలామాకు చెక్.. అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ ఎప్పుడో చెప్పిన అర్జున్
Vettaiyan | రజినీకాంత్ వెట్టైయాన్ ఆడియో లాంచ్ డేట్, ప్లేస్‌పై మేకర్స్ క్లారిటీ
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది