Sir Madam | మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి నిత్యా మీనన్ కాంబోలో వస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘తలైవన్ తలైవి’ (Thalaivan Thalaivii). తెలుగులో సార్ మేడమ్ (Sir Madam) టైటిల్‌తో ఆగష్టు 01న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త లుక్ షేర్ చేస్తూ.. సార్ మేడమ్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 250 సెంటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
యాక్షన్ ప్యాక్డ్ రైడ్‌తో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అంటూ విడుదల చేసిన న్యూ లుక్‌లో విజయ్ సేతుపతి, నిత్యమీనన్ ఫోన్లో చూసి నవ్వుకుంటుండటం చూడొచ్చు. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.
విజయ్ సేతుపతి, నిత్య మీనన్ ఈ చిత్రంలో భార్యభర్తలుగా సందడి చేయబోతున్నారు. పెళ్లయిన మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత ప్రతీ దానికి చిరాకు, గొడవలు పడడం. ఈ గొడవలు వారి వైవాహిక జీవితాన్ని, వారి బిజినెస్‌ను ఎలా ప్రమాదంలో పడేస్తాయనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటివరకు విడుదల చేసిన రషెష్ చెబుతున్నాయి.
250+ screens lo dhamki ready! 🔥#SirMadam hits AP & Telangana theatres from tomorrow — don’t miss the action-packed ride!@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor… pic.twitter.com/uzEEq71yhV
— BA Raju’s Team (@baraju_SuperHit) July 31, 2025
Pawan Kalyan | ఓజీ కోసం వన్స్‌మోర్ అంటోన్న పవన్ కల్యాణ్.. ఏ విషయంలోనో తెలుసా..?
Vijay Devarakonda | ‘కింగ్డమ్’ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
Param Sundari | విడుదల తేదీని ప్రకటించిన జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’