ఈ ఏడాది విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు కమల్ హాసన్ (Kamal Haasan). ఈ మూవీలో స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించాడు. విక్రమ్‌లో విజయ్ సేతుపతి పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఓ వైపు కమల్ హాసన్, మరోవైపు విజయ్ సేతుపతిని సిల్వర్ స్క్రీన్‌పై చూసి ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. కాగా ఇపుడొక వార్త ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతుందట.
హెచ్ వినోథ్ (H.Vinoth) దర్శకత్వంలో రాబోతున్న సినిమా కమల్, విజయ్ను మళ్లీ కలుపనుందని కోలీవుడ్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కమల్, విజయ్ కాంపౌండ్స్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. హెచ్ వినోథ్ ప్రస్తుతం అజిత్‌తో తునివు చిత్రం చేస్తున్నాడు.
కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న ఇండియన్ 2తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతోపాటు మణిరత్నంతో కూడా ఓ సినిమా ప్రకటించాడు. మరోవైపు విజయ్ సేతుపతి కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. మరి బిజీ షెడ్యూల్స్ మధ్య ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
Read Also : HariHaraVeeraMallu | పవన్ కల్యాణ్ యాక్షన్ మూడ్.. హరిహరవీరమల్లు లొకేషన్లో క్రిష్
Read Also : Love Today Trailer | మా ఇంట్లో నేనేం చెప్తే అది.. కానీ ఈ ఇంట్లో కొంచెం కష్టం.. లవ్ టుడే ట్రైలర్
Read Also : Ram Charan | రాంచరణ్ నయా జిమ్ చూశారా..? ఆర్సీ 15 కోసం వర్కవుట్స్ వీడియో
Read Also : Dhamki | ఫస్ట్ లుక్‌తోనే ధమ్కీ ఇస్తున్న విశ్వక్ సేన్.. ట్రెండింగ్‌లో పోస్టర్