కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి ఛేదు అనుభవం ఎదురైంది. విజయ్ సేతుపతి బెంగళూరు ఎయిర్ పోర్టు (Bengaluru airport) నుంచి బయటకు వస్తుండగా..గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వెనుక నుంచి వచ్చి విజయ్ పై దాడి చేశాడు. అయితే విజయ్ పక్కనే ఉన్న అనుచరులు, జవాన్లు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఊహించని విధంగా జరిగిన దాడి ఘటనతో విజయ్ సేతుపతి ఒక్కసారిగా షాక్కు లోనయ్యాడు.
విజయ్ సేతుపతి ఎయిర్ పోర్టు అధికారుల రక్షణలో ఎయిర్ పోర్టులో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా సదరు వ్యక్తి వెనక నుంచి వచ్చి ఎగిరి తన్నేందుకు ప్రయత్నించిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అనంతరం విజయ్ సేతుపతిని సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు ఎయిర్ పోర్టు అధికారులు (Airport Security Team).
Actor #VijaySethupathi attacked at Bengaluru airport. Initial reports say the incident happened yesterday night. More details awaited… pic.twitter.com/07RLSo97Iw
— Janardhan Koushik (@koushiktweets) November 3, 2021
ఇంతకీ ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? భారీ భద్రత ఉండే ఎయిర్ పోర్టులో జరిగిన దాడికి గల కారణాలేంటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?