Ace | పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. మక్కళ్ సెల్వన్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఏస్ (Ace). ఈ చిత్రానికి ‘ఒరు నల్ల నాల్ పాత్తు సొల్రెన్’ ఫేం ఆరుముగకుమార్ దర్శకత్వం వహించాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా.. యోగి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఏస్ మే 23, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ సినిమాస్ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. రొమాంటిక్ క్రైం కామెడీ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీతో రుక్మిణి వసంత్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బిఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిస్సిల్లా నాయర్, జాస్పర్ సుపయ్య, కార్తీక్ జై, నాగులన్, జహ్రినారిస్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని 7Cs ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తుంది.
#MakkalSelvan @VijaySethuOffl ‘s Romantic Crime Comedy #ACE Releasing Worldwide On May 23rd
Telugu Release Through #BShivaPrasad ‘s @spcinemas_#ACEFromMay23@rukminitweets @7CsPvtPte @Aaru_Dir @iYogiBabu
@justin_tunes @samcsmusic#KaranBRawat @andrews_avinash
@rajNKPK… pic.twitter.com/Ta92NF3X9q— BA Raju’s Team (@baraju_SuperHit) May 17, 2025
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!