Vijay | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం జన నాయగన్ (Jana Nayagan). తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో వస్తోంది. ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 9నే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉంది. అయితే జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ టీం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. రాజకీయ కారణాలతో జననాయగన్ సినిమాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇప్పటికే టీవీకే ఆరోపిస్తోంది.
కాగా ఇటీవలే సెన్సార్ బోర్డు సుప్రీంకోర్టు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ నిర్మాతలు ఏదైనా అప్పీలు చేస్తే తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని సెన్సార్ బోర్డు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అయితే ఇప్పటివరకు సినిమా చిక్కులకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోతున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు విజయ్.
ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నా పొలిటికల్ ఎంట్రీ కారణంగా నా జననాయగన్ మూవీ నిర్మాత ఇబ్బందులు పడుతుండటం బాధగా ఉంది.
నా రాజకీయారంగేట్రం వల్ల నా సినిమా ప్రభావితమవుతుందని తెలుసు. దీనిపై నేను ముందే మానసికంగా సిద్ధమయ్యానన్నాడు విజయ్. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మరి సెన్సార్ సమస్యలు ఎప్పుడు క్లియరవుతాయి.. సినిమా విడుదల ఎప్పుడు అవుతుందనేది డైలామా నెలకొంది.
కార్తీ (ఖాకీ) ఫేం హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ నిర్మిస్తోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీ రోల్లో కనిపించనున్నారు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.