Sampradayini Suppini Suddapoosani | టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani). సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లకు రాకుండా నేరుగా డిజిటల్ వేదికగా విడుదలవుతోంది. అయితే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ దక్కించుకోగా.. తాజాగా స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఒకప్పుడు వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న శివాజీ, లయ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘స్వయంవరం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి చిత్రాల్లో వీరి కెమిస్ట్రీకి మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు మళ్ళీ ఒక వెరైటీ టైటిల్‌తో, క్రైమ్ ఎలిమెంట్స్ కలిసిన కామెడీ ఎంటర్టైనర్తో వీరు రాబోతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
Date is locked.#SampradayiniSuppiniSuddapoosani premieres on Feb 12th ❤️🎞️
A @etvwin Original Production pic.twitter.com/zMiI0590gy
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 31, 2026