కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) స్పీడు మీదున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో నటిస్తున్న బీస్ట్ (Beast) షూటింగ్ పార్టును పూర్తి చేశాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. బీస్ట్ షూటింగ్ చివరి రోజున డైరెక్టర్ నెల్సన్ తో దళపతి విజయ్ ప్రత్యేకమైన క్షణాలు అంటూ ట్వీట్ చేసింది. ఇపుడీ స్టిల్ ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ పోషిస్తోంది. బీస్ట్ సినిమా షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేశాం. నెల్సన్ దిలీప్ కుమార్, విజయ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో బీస్ట్ సినిమా పక్కా వినోదాన్ని అందించడం ఖాయమని ఇప్పటికే సోషల్ మీడియాలో వీడియో ట్వీట్ చేసింది పూజాహెగ్డే . తన షూటింగ్ చివరి రోజున ఇక థియేటర్లలో కలుద్దామంటూ వీడియో సందేశాన్ని పోస్ట్ చేయగా..ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Here’s a special moment from Thalapathy @actorvijay’s last day of shoot for #Beast with director @Nelsondilpkumar@hegdepooja @anirudhofficial @manojdft @nirmalcuts @anbariv #BeastShootWrap pic.twitter.com/6f2Tj2a4lE
— Sun Pictures (@sunpictures) December 11, 2021
బీస్ట్ మూవీని 2022 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదలపై క్లారిటీ రానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde saree | పూజాహెగ్డే చీర ఖరీదు తెలిస్తే షాకే..!
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!